కాలం మారిపోతోందన్నట్టు.. వాతావరణం కూడా తారుమారవుతోంది. వర్షాకాలంలో ఎండలు మండిపోవడం, వేసవిలో వర్షాలు కురవడం, శీతాకాలంలో చలి తగ్గిపోవడం చూస్తున్నాం. అంతేకాదు, ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే దొరికే పండ్లు, కాయలు ఇప్పుడు ఏడాదంతా లభిస్తున్నాయి. ఈ జాబితాలో వేసవికే ప్రత్యేకమైన తాటిముంజలు కూడా చేరాయి. ఇప్పుడు శీతాకాలంలోనే ఇవి మార్కెట్లో కనిపిస్తున్నాయి. విశాఖ శివార్లలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం ప్రాంతాల నుంచి తెచ్చిన తాటిముంజలను విశాఖ–భీమిలి బీచ్ రోడ్డులోని సీతకొండ వద్ద ఓ వ్యక్తి విక్రయించాడు. ఒక్క డజను తాటిముంజలను రూ.100 చొప్పున అమ్మినట్లు సమాచారం.




















