గోదారి జిల్లాల్లో ఎన్ని వెరైటీ వంటకాలున్నాయో! వాటిలో ఒకటే ఈ తాటి బూరెలు. తినడం మొదలుపెడితే అసలు ఆపలేం అనుకోండి. వీటిని ఎలా తయారు చేయాలో మనమూ తెలుసుకుందాం.
కావాల్సినవి: తాటిపండు గుజ్జు – కప్పు, బియ్యంపిండి – కప్పు, బెల్లం – పావుకప్పు, యాలకుల పొడి-చెంచా, కొబ్బరితురుము (ఎండు లేదా పచ్చికొబ్బరి) – పావుకప్పు, నూనె – తగినంత.
గోదావరి స్పెషల్
తయారీ: ఒక పాత్రలో తాటిపండు గుజ్జు, బియ్యం పిండి, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుము, వేసి జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకుంటే సరి. ఇదే విధానంలో గారెలు మాదిరిగానూ చేయొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్న అరిటాకు మీద వేసి గారెల్లా వత్తుకుని నూనెలో వేయిస్తే తాటి గారెలు సిద్ధమవుతాయి. ఇవే కాదు, ఇలా తాటి గుజ్జుతో ఇడ్లీ, రొట్టెలు, కుడుములు కూడా చేసుకోవచ్చు.




















