సాధారణంగా కర్పూర అరటి గెలలో ఒక్కో హస్తంలో 14 నుండి 20 వరకు మాత్రమే కాయలు ఉంటాయి. అయితే తణుకుకు చెందిన అరటిపండ్ల వ్యాపారి నానికి తోటలో కాసిన ఓ గెలలోని అత్తంలో ఏకంగా 80 కాయలు రావడం విశేషంగా నిలిచింది. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా ఉద్యానశాఖ అధికారిణి ప్రియదర్శిని మాట్లాడుతూ, తణుకు–పెరవలి పరిసర ప్రాంతాల నేలలు అరటి సాగుకు అనుకూలంగా ఉండటంతో గెలల పొడవు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నేలలో పోషకాలు అధికంగా ఉన్నప్పుడు అదనంగా కాయలు కాసే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు.



















