ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న పనులను అభినందించడానికి వెంకటేశ్వరరావు గత నెలలో పాలకొల్లులోని మంత్రి నిమ్మల కార్యాలయానికి ఆటోలో వచ్చారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రితో ఫోటో దిగాలనే కోరికను, అలాగే ట్రై సైకిల్ కావాలనే విజ్ఞప్తిని మంత్రి నిమ్మల దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలో మంత్రి నిమ్మల, వెంకటేశ్వరరావు కోరికలు తీరుస్తానని హామీ ఇచ్చారు.
అయితే, దివ్యాంగుడి స్పందన చూసి చలించిన మంత్రి నారా లోకేష్, తన సొంత నిధులతో ట్రై స్కూటీ అందజేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో, లోకేష్ హామీ ఇచ్చిన విధంగా వెంకటేశ్వరరావుకు స్వయంగా ట్రై స్కూటీని అందజేశారు. మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.





















