నగరంలో ఆదాయపన్ను శాఖ విస్తృత సోదాలు నిర్వహించింది. ఓ సమయంలోనే 15 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ప్రముఖ హోటళ్లకు చెందిన ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో దర్యాప్తు చేసి పత్రాలను పరిశీలిస్తున్నారు. పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్ హోటళ్లలో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ హోటళ్లు ప్రతి సంవత్సరం వందల కోట్లు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు. పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్లకు దేశంలోని ఇతర నగరాలతో పాటు దుబాయ్‌లో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి. భారీ పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ చర్యలు తీసుకుంది. రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ యజమాని మాజిద్ నివాసంతో పాటు శాలిబండలోని ప్రధాన బ్రాంచ్‌లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.


















