రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో తితిదే నిర్మిస్తున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి త్వరలో మహర్దశ రానుంది. ఆలయ విస్తరణలో భాగంగా రెండో ప్రాకారం నిర్మించాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 27న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో ప్రాకారం నిర్మాణ పనుల శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10.55 నుంచి 11.30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల ఆలయ నమూనాలోనే ఇక్కడ రెండో ప్రాకారం నిర్మించనున్నారు. పడమర, ఉత్తరం, దక్షిణ దిక్కుల్లో ఐదు అంతస్తుల గాలి గోపురాలు, తూర్పు వైపున ఏడు అంతస్తులతో మహా రాజగోపురం నిర్మాణం చేపట్టనున్నారు. మహా రాజగోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు వంటి నిర్మాణాలు కూడా ప్రణాళికలో ఉన్నాయి.


















