ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా క్రిస్మస్ కానుకగా చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో భాగంగా చిన్న మ్యూజికల్ సర్‌ప్రైజ్‌ను అందిస్తూ ‘రాజే యువరాజే…’ అనే పాట ప్రోమోను ప్రేక్షకులకు పరిచయం చేసింది.




















