విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఆకుపై రాజముద్రను సృజించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు అప్పికొండ మేఘన, గుమ్మడి శశిప్రియచే ఆకుపై “Constitution Day” అనే ఆంగ్ల అక్షరాలు మరియు సింహాలతో కలిగిన రాజముద్రను తీర్చిదిద్దారు. కార్యక్రమంలో పీడీ రవికుమార్, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం కమలవాణి మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.



















