బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభమైంది. మొత్తం 20 జిల్లాల్లో 122 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందుకోసం 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దిల్లీ పేలుడు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను మరింత బలపరిచారు.




















