తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన పెళ్లి వేడుకలో చోరీ జరిగింది. తెలంగాణకు చెందిన ఓ ఐఆర్‌ఎస్ అధికారి గురువారం రాత్రి చెంచుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వివాహానికి హాజరయ్యారు. ఆయన తిరిగి వెళ్లేందుకు పార్కింగ్ చేసిన కారు వద్దకు వెళ్లగా అద్దం పగిలి ఉండటాన్ని గమనించారు. కారులో పెట్టిన బ్యాగ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో రూ.5లక్షల నగదు, రూ.10లక్షల విలువైన బంగారం, 3 ఐఫోన్‌లు, పాస్‌పోర్ట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. దీనిపై తెనాలి మూడో పట్టణ పోలీసులకు ఐఆర్‌ఎస్ అధికారి ఫిర్యాదు చేశారు.
ఇంట్లో చోరీ.. రూ.10లక్షల విలువైన బంగారం చోరీ
మరోవైపు కొల్లిపర మండలం తూములూరులో మరో చోరీ జరిగింది. మోటూరు మధుసూదనరావు ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.10లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. దీనిపై బాధితులు కొల్లిపర పోలీసులకు ఫిర్యాదు చేశారు.




















