మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌పై హైదరాబాద్‌లో ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అవగాహన కల్పిస్తోంది. సంస్థ ప్రతినిధులు నగరంలోని చార్మినార్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్ ఐమాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కిమ్స్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో మంగళవారం పింక్ రంగు లైట్లను ఏర్పాటు చేసి సందేశం ఇచ్చారు.


















