ShivaSakthi News
Advertisement
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
    • ఫోటోలు
    • వీడియోలు
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
    • ఫోటోలు
    • వీడియోలు
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
  • రాశి ఫలాలు
  • చదువు

ఈరోజు రమా ఏకాదశి (17-10-2025, శుక్రవారం)

October 17, 2025
in Devotional
0
ఈరోజు రమా ఏకాదశి (17-10-2025, శుక్రవారం)
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఏకాదశి వ్రతం నామ సర్వకామఫలప్రదం || కర్తవ్యం సర్వదా విప్రైర్ విష్ణు ప్రీణన కారణం |

రమా ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజ సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది.

“ఓ జనార్దనా! ఆశ్వీయుజమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని నాకు వివరించవలసినది” అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు.

అపుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ “ఓ రాజసింహమా! ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇపుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను” అని పలుకసాగాడు.

చాలాకాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాతరాజు ఉండేవాడు. అతడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడ అతనికి స్నేహం ఉండేది. సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు.

కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వోత్తమ నదియైన చంద్రభాగా యొక్కపేరును ఆ అమ్మాయికి పెట్టారు. యుక్తవయస్సు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో పరిణయము జరిగింది. ఒకసారి శోభనుడు ఏకాదశిరోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రభాగ కలవరపడినదై తనలో తాను “ఓ దేవా! ఇప్పుడేమి చేయాలి? నా భర్త దుర్బలుడు; ఆకలిని తట్టుకోలేడు. నా తండ్రి మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడ వేస్తాడు”. అని అనుకోసాగింది.

ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో “ఓ ప్రియపత్నీ! ఇపుడు నన్నేమి చేయమంటావు? నా ప్రాణం రక్షింపబడడానికి, అలాగే రాజాజ్ఞ ఉల్లంఘించకుండ ఉండడానికి ఏం చేయాలో చెప్పు” అని అన్నాడు.

అపుడు చంద్రభాగ తన భర్తతో “స్వామీ! మనుషుల మాట అటుంచండి. నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుఱ్ఱాలు, ఇతర జంతువులకు కూడ ఈ రోజు ఆహారం ఉండదు. కనుక ప్రభూ! ఇక

మనుషులెట్లా తినగలుగుతారు. ఒకవేళ తప్పకుండ తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసికోండి.”

భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో “నీవు చెప్పింది అక్షరాల సత్యమే. కాని నాకు ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉందో అది జరిగియే తీరుతుంది కదా!” అని అన్నాడు.

ఈ విధంగా తలచిన శోభనుడు పవిత్ర ఏకాదశివ్రతపాలనకు ఉద్యుక్తుడయ్యాడు. కాని అతడు ఆకలిదప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు. ఓ రాజసింహమా! ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో గడిపివేసారు. కాని ఆ రేయి గడపడం శోభనునికి అసాధ్యమైంది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహనసంస్కారాలు చేసాడు. ముచుకుందుని ఆజ్ఞ చంద్రభాగ సతీసహగమనం మేరకు మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తరువాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది. “రాజా! ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి జుగా జన్మించాడు. అది మందర పర్వతము పైన ఉన్నది. రత్నఖచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది, మణిఖచితమగు గోడలు కలిగినదియైన ఐశ్వర్యయుత ప్రాసాదములో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రము పట్టబడియుండేది. కర్ణకుండలములతో, కంఠాభరణములతో, బంగారు భుజకీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్యసింహాసనమున కూర్చునేవాడు. గంధర్వులచే, అప్సరసలచే సేవింపబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించెడివాడు. “

ఒకరోజు ముచుకుందపుర నివాసియైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్ధయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణుని చూడగానే రాజు లేచి నిలబడి, చేతులు జోడించి నమస్కరించాడు. తరువాత అతడు బ్రాహ్మణుని కుశల మడిగాడు. తరువాత ముచుకుందుడు, తన భార్య చంద్రభాగ, ముచుకుందపుర జనుల గురించిన క్షేమసమాచారాలు కూడ అడిగాడు. అపుడు బ్రాహ్మణుడు అందరి క్షేమసమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతియొక్కరు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో “రాజా! ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడును చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది” అని అడిగాడు.

“ఆశ్వీయుజ కృష్ణపక్షంలో వచ్చే రమాఏకాదశిని పాటించిన ప్రభావము వలననే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమా! ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పవలసినది. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి. ఆమె దీనిని సుస్థిరమొనర్చగలిగే సామర్థ్యము కలిగినట్టిది” అని శోభనుడు అన్నాడు.శోభనుని మాటలను వినిన బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరించాడు. అది వినిన చంద్రభాగ అమితానందభరితురాలు అయింది. తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికింది. అపుడు సోమశర్మ ఆమెతో “అమ్మా! నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూసాను. ఆ పురము సూర్యప్రభలతో వెలిగిపోతోంది. కాని ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నీవు సుస్థిరం చేయాలి” అని అన్నాడు. అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసికొని వెళ్ళమని బ్రాహ్మణుని అర్ధించింది. తన పుణ్యపరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది. భార్యాభర్తలైన తాము కలిసికొనే ఏర్పాట్లు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యము కలుగుతుందని ఆమె బ్రాహ్మణునితో అన్నది.

తదనంతరము సోమశర్మ చంద్రభాగను మందరపర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుని ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. దేదీప్యమానమగు ముఖవర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేదమంత్రోపదేశం చేసాడు. వామదేవుడు ఒసగిన మంత్ర ప్రభావం వలన ఏకాదశి వ్రతమహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తరువాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలిసికొన్నది.

భార్యను చూడగానే శోభనుడు పరమానందభరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు. అపుడు చంద్రభాగ తన భర్తతో “ప్రభూ! నా మంచిమాటలు వినండి. నేను నా తండ్రి ఇంట్లో ఎనిమిదేండ్ల వయస్సు నుండే ఏకాదశివ్రత పాలనము చేస్తున్నాను. ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతము వరకు దీనిని సమృద్ధిగా నిలుపు గాక!” అని అన్నది. ఆ తరువాత ఆమె వివిధ నగలతో అలంకృతమైన దివ్యశరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడ దివ్యశరీరాన్ని పొంది మందరపర్వత చరియలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది.

శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ “రాజా! పరమమంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని కచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్యాపాతకము వంటి పాపం నుండైనా విస్సందేహముగా బయటపడతాడు. నల్లగోవు, తెల్లగోవు రెండు కూడ తెల్లనిపాలే ఇచ్చినట్లు కృష్ణపక్ష ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి రెండు కూడ వ్రతానుయాయులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు” అని చెప్పి ముగించాడు.

ShareTweetSend
Previous Post

ఇంద్రకీలాద్రి జగన్నాత కనకదుర్గమ్మకు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు సమర్పణ

Next Post

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది: 17-10-2025 సమాచారం

Related Posts

కార్తీక పురాణం 13వ అధ్యాయం
Devotional

కార్తీక పురాణం 13వ అధ్యాయం

November 2, 2025
రేపు ‘ఈటీవీ’ ప్రత్యేక కార్తిక దీపోత్సవ కార్యక్రమం
Andhra Pradesh

రేపు ‘ఈటీవీ’ ప్రత్యేక కార్తిక దీపోత్సవ కార్యక్రమం

November 1, 2025
వెంకటేశ్వర స్వామివారు
Devotional

రామచంద్రాయ జనక (మంగళం)

November 1, 2025
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది
Devotional

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది — 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు — శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది.

November 1, 2025
శ్రీశైల శిఖరాన్ని దర్శించినవారికి పునర్జన్మ ఉండదంటారు — అది నిజమో కాదో ఒకసారి తెలుసుకుందాం.
Devotional

శ్రీశైల శిఖరాన్ని దర్శించినవారికి పునర్జన్మ ఉండదంటారు — అది నిజమో కాదో ఒకసారి తెలుసుకుందాం.

November 1, 2025
కార్తీక పురాణం - 11వ అధ్యాయము
Devotional

కార్తీక పురాణం – 11వ అధ్యాయము

November 1, 2025
Next Post
latest update on tirumala

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది: 17-10-2025 సమాచారం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
meenam

రాశి ఫలాలు – మీనం

November 1, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కార్తీక పురాణం 13వ అధ్యాయం

కార్తీక పురాణం 13వ అధ్యాయం

November 2, 2025
ఈ వరుడు నిజంగా చాలా స్పీడ్‌గా ఉన్నాడుగా! కెమెరామెన్‌కే ఏం షాక్ ఇచ్చాడో చూడండి

ఈ వరుడు నిజంగా చాలా స్పీడ్‌గా ఉన్నాడుగా! కెమెరామెన్‌కే ఏం షాక్ ఇచ్చాడో చూడండి!

November 2, 2025
కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్: అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు

కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్: అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు

November 2, 2025
జుట్టు రాలిపోతుందా? అయితే, ఈ స్మూతీ తప్పక ప్రయత్నించండి!

జుట్టు రాలిపోతుందా? అయితే, ఈ స్మూతీ తప్పక ప్రయత్నించండి!

November 1, 2025

Recent News

కార్తీక పురాణం 13వ అధ్యాయం

కార్తీక పురాణం 13వ అధ్యాయం

November 2, 2025
ఈ వరుడు నిజంగా చాలా స్పీడ్‌గా ఉన్నాడుగా! కెమెరామెన్‌కే ఏం షాక్ ఇచ్చాడో చూడండి

ఈ వరుడు నిజంగా చాలా స్పీడ్‌గా ఉన్నాడుగా! కెమెరామెన్‌కే ఏం షాక్ ఇచ్చాడో చూడండి!

November 2, 2025
కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్: అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు

కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్: అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు

November 2, 2025
జుట్టు రాలిపోతుందా? అయితే, ఈ స్మూతీ తప్పక ప్రయత్నించండి!

జుట్టు రాలిపోతుందా? అయితే, ఈ స్మూతీ తప్పక ప్రయత్నించండి!

November 1, 2025
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh
  • Blog
  • Business
  • Career
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • Health
  • India
  • Kids Stories
  • Lifestyle
  • Movies
  • News
  • Politics
  • Rasi Phalalu
  • Recipes
  • Sports
  • Technology
  • Telangana
  • Video Gallery
  • World

Recent News

కార్తీక పురాణం 13వ అధ్యాయం

కార్తీక పురాణం 13వ అధ్యాయం

November 2, 2025
ఈ వరుడు నిజంగా చాలా స్పీడ్‌గా ఉన్నాడుగా! కెమెరామెన్‌కే ఏం షాక్ ఇచ్చాడో చూడండి

ఈ వరుడు నిజంగా చాలా స్పీడ్‌గా ఉన్నాడుగా! కెమెరామెన్‌కే ఏం షాక్ ఇచ్చాడో చూడండి!

November 2, 2025
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.