ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం – 11వ అధ్యాయము

November 1, 2025
in Devotional News
0
కార్తీక పురాణం - 11వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మ౦థరుడు – పురాణ మహిమ
ఓ జనక మహారాజా! యీ కార్తిక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనంచేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము అని వశిష్టులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్యమా౦సాది పానీయములు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను.
మంధరుడు ఇతరుల యిండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండనతనిని భయపెట్టి కొట్టి ధనమపహ రించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను.

      సమిపమందున్న ఒక గుహనుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకునిపై బడెను. కిరతకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజాతో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను.  ఈ విధముగా ఒకేకాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవి౦చుచు రక్తము గ్రక్కుచు బాధపడుచు౦డిరి.  మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలచుకోని దుఃఖించుచు కాలము గడుపుచు౦డెను. కొన్నాళ్లకు ఆమె యింటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను.  ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన, నాకు మోక్షమార్గము ప్రసాదించు"మని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి "అమ్మా! ఈ దినము కార్తీకపౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొనవచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసికొని రావాలయును.  దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీవందుకొనుము" అని చెప్పినతోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను.   అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించినవారినెల్ల "ఆరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని" చెప్పెను. ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠమునకు దీసికోనిపోయిరి.
     కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక మందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి "ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురునూ యీ నరక బాధపడుచున్నారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్దరింపు"డని ప్రాధేయపడెను.  అంత విష్ణుదూతలు "అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ము డైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనముపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరక బాధలు పడుచున్నారు", అని వారి చరిత్రలు చెప్పిరి.  అందుల కామె చాల విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురనూ కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించగా, అందులకా దూతలు "అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిదెఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కల్గిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగు"నని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను.    అ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టుల వారు నుడివిరి.

ఏకాదశాధ్యాయము – పదకొండవరోజు పారాయణము సమాప్తము.

ShareTweetSend
Previous Post

శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి

Next Post

తలను నరికి, చేతి వేళ్లు కత్తిరించి.. మహిళపై అమానుష హత్య

Related Posts

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!
Devotional News

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!

September 8, 2026
గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక
Devotional News

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

September 5, 2026
500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు
Devotional News

500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు

September 5, 2026
Wishing you and your loved ones a blessed and joyful Krishna Ashtami!
India News

Wishing you and your loved ones a blessed and joyful Krishna Ashtami!

September 4, 2026
పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు
Devotional News

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

September 3, 2026
రౌతులపూడిలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు
Devotional News

రౌతులపూడిలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు

September 3, 2026
Next Post
మహిళ దారుణ హత్య

తలను నరికి, చేతి వేళ్లు కత్తిరించి.. మహిళపై అమానుష హత్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

September 9, 2026
రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

September 9, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.