మహేశ్‌బాబు కథానాయకుడిగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల #GlobeTrottereventలో విడుదలైన ఐమ్యాక్స్ స్పెషల్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రాజమౌళి సృష్టించిన విస్తృత ప్రపంచాన్ని మామూలు తెర కాకుండా, ఐమ్యాక్స్ స్క్రీన్‌లో చూడడం కొత్త అనుభూతిని ఇస్తుంది.మహేశ్‌బాబు రుద్ర పాత్రలో, కథానాయిక ప్రియాంకా చోప్రా, ప్రతినాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో కనిపించనున్నారు. సంగీతం ఎం.ఎం.కీరవాణి, నిర్మాణం కేఎల్ నారాయణ (దుర్గా ఆర్ట్స్). తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్ స్క్రీన్ల కోసం ప్రేక్షకుల ఆశలు పెరుగుతున్నాయి.





















