నల్గొండ: చిట్యాల వద్ద హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ వాహన రద్దీ ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చిట్యాల రైలు వంతెన కింద భారీగా వరద నీరు చేరడంతో, హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. దీంతో డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




















