విశాఖపట్నం: పెందుర్తి మండలంలో ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి వెళ్లిన వీఆర్ఓలపై దాడి జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు వీఆర్ఓలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
దాడిలో స్వల్పగాయాలపాలైన వీఆర్ఓలు వెంటనే పెందుర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఘటనపై విచారణ కొనసాగుతోంది.
అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్థానిక అధికారులు తెలిపారు.



















