స్కూల్ రోజుల నుంచే అతని స్వభావం ఘాటు! మృదుత్వం, సాఫ్ట్ నెస్ లేదా స్మార్ట్ నెస్ కన్నా, అతనిలో మండే అగ్నిజ్వాల స్పష్టంగా కనిపించేది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఒక గురువు గుర్తించి మార్గనిర్దేశం చేశారు. తరువాత అతను న్యాయశాస్త్రం వైపు వెళ్లి, నిఘా సంస్థలో పనిచేయాలనే తన కలను నిజం చేసుకున్నాడు. కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరిగా ఎదిగి, దాదాపు ఇరువై సంవత్సరాలుగా రష్యాకు అధ్యక్షుడిగా సేవలందిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ కథ ఇదే.



















