మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం బంధువులు దాఖలుచేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నేడు (శుక్రవారం) తిరస్కరించింది. కోర్టు, ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని స్పష్టత ఇచ్చింది.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల ఆధీనంలో ఉన్నారని కోర్టులో హాజరుపరచాలని రాజిరెడ్డి కుమార్తె స్నేహలత, దేవ్ జీ సోదరుడు పిటిషన్ వేశారు. గత విచారణలో పోలీసుల ప్రెస్ స్టేట్‌మెంట్‌ను ఆధారంగా తీసుకుని కోర్టు పిటిషనర్లను ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది.
నేటి విచారణలో పిటిషనర్ల న్యాయవాది వీడియో ఆధారాలు సమర్పించారు. ధర్మాసనం ఈ వీడియో పరిశీలనలో, దేవ్ జీ, రాజిరెడ్డి పోలీసుల నిర్బంధంలో ఉన్నాయని ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని గుర్తించింది. దీంతో, ఈ వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ప్రకటిస్తూ పిటిషన్‌ను మూసివేసింది.




















