ఈ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా గోపురాల విస్తరణ, ఆలయ ప్రాంగణం అభివృద్ధి, భక్తుల కోసం వసతి సదుపాయాలు, ప్రదక్షిణ మార్గం, తులాభారం మండపం, ప్రసాదాల విక్రయ కేంద్రాలు, యాత్రికుల సేవలు, అలాగే పార్కింగ్ వ్యవస్థ వంటి కీలక మౌలిక వసతులు ఏర్పాటు చేయబడనున్నాయి.
అంతేకాదు, తిరుమలలో ఉన్నట్టే లడ్డూ ప్రసాదం, దివ్యదర్శనం క్యూలైన్లు, ధర్మదర్శనం సౌకర్యాలు, డిజిటల్ దర్శనం టోకెన్ వ్యవస్థ కూడా ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఆలయం పూర్తయితే అమరావతి భక్తి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని అంచనా. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కేవలం ఒక ఆలయ నిర్మాణం మాత్రమే కాదు,
“భక్తి,ఆస్థికత,సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే మహాకార్యం.”



















