ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి, తనను ఆత్మహత్య చేసుకోనీయడంలేదని భావించి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి, అనంతరం తానే పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా, భార్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన తోటమళ్ల నాగభూషణం (65), జయమ్మ (60) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. కుమారుడు అదే గ్రామంలో వేరుగా నివసిస్తున్నాడు.
నాగభూషణం గత రెండేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్య కారణంగా తరచూ తీవ్రమైన నొప్పులు రావడంతో ఆయన పలుమార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ప్రతి సారి భార్య జయమ్మ అడ్డుకుని అతడిని కాపాడుతూ వచ్చారు.
గురువారం రాత్రి కూడా నాగభూషణం పురుగుమందు తాగేందుకు ప్రయత్నించగా జయమ్మ గమనించి మందు డబ్బాను లాక్కొని అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన నాగభూషణం అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం తానే పురుగుమందు తాగి స్పృహ కోల్పోయాడు.
జయమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వెంటనే ఇద్దరినీ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన జయమ్మను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఈ ఘటనపై వారి కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం నాగభూషణం మృతదేహాన్ని తిరుమలాయపాలెం గ్రామానికి తరలించారు. ఈ విషాద ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















