శ్రీకాంత్ తనయుడు, నటుడు రోషన్ ‘ఛాంపియన్’ చిత్రంతో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించగా, అనస్వర రాజన్ కథానాయికగా నటించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రోషన్, తన ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాతో వస్తున్నాను. ఈ మూడేళ్లలో ఎంతో నేర్చుకున్నాను… ఇక ఆగేది లేదు. ‘ఛాంపియన్’ మన తెలుగు వారి చరిత్రను, బైరాన్‌పల్లి గ్రామంలోని వీరుల గాథను చెప్పే చిత్రం. ఈ సినిమాను, ముఖ్యంగా మైఖేల్ విలియమ్స్ పాత్రను నాకిచ్చిన దర్శకుడు ప్రదీప్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని రోషన్ తెలిపారు.




















