మొదటి భాగం 5/25
‘ఆనాటి నుంచి నేను సదా అవిచ్చిన్న ఎరుకలో వున్నాను.దేని కోసమూ ఎటువంటి ప్రయత్నమూ చేయనవసరం లేదనీ,తీవ్రసాధన – తాత్వికచింతన అనవసరమనీ తెలుసుకున్నాను.” ఆ అనుభవం, వెంకట్రామన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతని దేహస్థితిలోనూ, మార్పు వచ్చింది. తనకు కలిగినఆ అనుభవాన్ని పురస్కరించుకుని ఒకసారి భగవాన్, ‘నేనుఈ దేహం కాదు. నేను శాశ్వతమైన ఆత్మ స్వరూపాన్ని, రక్త -మాంసాదులతో కూడిన ఈ దేహంలో తాత్కాలికంగా వున్నాను,”అన్నారు.వెంకట్రామన్ కు కలిగిన అనుభవం ప్రకారం చూస్తే,మనిషిలో “అసలు నేను అబద్ధపు నేను” అనే రెండు “నేను లుఉన్నట్లు ధ్వనిస్తుంది. సత్యమైన “నేనే ” శాశ్వతం, సాక్షిభూతం.అది స్వతంత్రమైనది. స్వయం ప్రకాశం కలది. లౌకిక వ్యవహారాలన్నింటినీ చక్కది. ‘మిధ్యా నేను” – అదే “అబద్ధపు నేను’.తనను తాను తెలుసుకునే సాధకుడు, నత్యమైన “నేను’ కూ,”విధ్యా నేను “కూ మధ్య నున్న భేద భావాన్ని సూక్ష్మ బుద్ధితోగ్రహించిన వెంటనే, మిధ్యా నేను తలక్రిందులుగా పడిపోయి, సత్యమైన నేను తానుగా తోస్తుంది. ఆ ‘నేను” స్వరూపమే, ఆనందం,మౌనం.
కాని, ఎవరూ సర్వసాధారణంగా ఆ “నేను” అనేదానిగురించి ఎప్పుడూ తీవ్రంగా యోచించరు. అసలు తామేమిటో చిత్రనిరూపణ చేసుకోరు. తామంటే, “దేహం. మేధస్సు బుద్ధి” అనే అనుకుంటారు. కాని, అసలు నేను” ఎవరు?” అని ఎవరూ ప్రశ్నించుకోరు. అందుచేత, ప్రతి ఒక్కరూ ముందు తమకు తాము ఏ అరమరికా లేకుండా లోపలా బైటా, ప్రతి క్షణం అన్ని విషయాల్లోపరీక్షించుకోవాలి. పరిశీలించుకోవాలి. అదంతా సరైన పద్ధతిలోజరగాలి. తమను తాము తెలుసుకోనిది, ఎన్ని చేసి, ఏంతెలుసుకునీ ప్రయోజనం వుండదు.
వెంకట్రామన్ మిత్రుల్ని పలకరించడం మానేశాడు. అతనివింత ప్రవర్తన ఇంట్లో వారిని హెచ్చరించింది. 1896 – ఆగస్ట్29వ తేది శనివారం ఉదయం పదకొండు గంటలకు వెంఠట్రామన్మేడమీద గదిలో కూర్చుని, ఇంగ్లీషు వ్యాకరణం సరిగా చదవనందుకు ఆ పాఠాన్ని టీచర్ మూడుసార్లు చూసిరాసి, తీసుకురమ్మన్నాడని బెయిన్ ఇంగ్లీషు గ్రామర్ పుస్తకం చూసి రాయడం ఆరంభించి, రెండు సార్లు రాసి, మూడోసారి రాసే ముందు ‘ఇలారాయడం వల్ల ఏం లాభం? ఏ లక్ష్యం లేకుండా పని చేయడానికి,నేను ఏమైనా యంత్రాన్నా ?” అని అనుకుని, రాసే పుస్తకాన్నిమూసేసి, పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు.
మొదటి నుంచీ వెంకట్రామన్ని గమనిస్తూ వున్న అన్న నాగస్వామి, ఆ సమయంలో అక్కడే వున్నాడు. అతడు వెంకట్రామన్నిచూసి, “ఇల్ల, వాకిలీ, చదువు, సంద్యా అఖ్కర్లేని వానికి, సాధుజీవనం అవలంబించే వానికి ఇంట సౌకర్యాలు అనుభవించే అధికారంఎక్కడ వుంది?” అని నిందాపూర్వకంగా మాట్లాడాడు. ఆ మాటలువెంకట్రామన్ హృదయాన్ని వాడి బాణాల్లాగా గుచ్చుకున్నాయి.అతనిలోని ఆవేశాన్ని రెచ్చగొట్టాయి. నాగస్వామి నిందా వాక్యం,వెంకట్రామస్ కి మేల్కొల్పుగా ధ్వనించి, “అవును, చదవని నాకుఇల్లెందుకు, అరుణాచలం వుండగా?” అని అనుకుని, వెంటనే ఇల్లువదలి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అప్పటికే అతని హృదయకవాటం పూర్తిగా తెరుచుకోవడం వల్ల, ఆనందపారవశ్యుడై, అరుణాచలం చేరుకొనేందుకు ఆరాటపడ్డాడు. నాగస్వామి అనిన మాటలుపరమ నత్యాలుగా తోచి, “నిజమే, చదువు మీద, ఒంటి మీద, ఇంటిమీద లక్ష్యం లేని నాకు, ఈ ఇంట్లో ఏం పని?” అనుకుని గృహపరిత్యాగానికి నిశ్చయించుకున్నాడు.
వెంకట్రామన్ గదిలోంచి బైటికి వెడుతూ వుంటే,’ఎక్కడికి?” అని నాగస్వామి అడిగాడు.
“ఈ మధ్యాహ్నం మాకు స్పెషల్ క్లాస్ వుంది. నేనుస్కూలుకు వెడుతున్నాను.” అన్నాడు వెంత ట్రామన్.
ఆ రోజు నాగస్వామి కాలేజీకి వెళ్ళలేదు. అతని కాలేజీకూడా వెంకట్రామన్ హైస్కూలు దగ్గర వుండటం చేత, పెపైలోఐదురూపాయలు ఉన్నాయి. పిన్నిని అడిగి తీసుకుని, నా కాలేజీజీతం కట్టు, అన్నాడు.
తాను అరుణాచలం వెళ్ళడం పెద్ద వాళ్ళకు తెలిస్తే అభ్యంతర పెడతారని వెంకట్రామన్ కి తెలుసు. కాని, సమయానికి నాగస్వామి తన కాలేజీ జీతం కట్టమంటూ ఐదు రూపాయలు ఇవ్వడందైవسه నిర్ణయంగా భావించి, ప్రయాణం స్థిరం చేసుకున్నాడు,వెంఠట్రామన్.
వెంకట్రామన్ కలిసి చదువుకున్న రంగయ్యర్ ఒకసారిశ్రీరమణాశ్రమానికి వచ్చినప్పుడు, “నేను అరుణాచలం వెళ్ళిపోతున్నాను,” అని నాతో ఒక్క మాపైనా చెప్పలేం?” అనిభగవాన్ని అడిగితే, “ఆ క్షణం వరకు నా మనసులో ఆ ప్రసలేదు” అన్నారు.
వెంకట్రామన్ భోజనం చేసి, పిన తల్లిని అడిగి ఐదురూపాయలూ తీసుకుని, ఇంట్లో ఒక పాత అట్లాస్ వుంటే దాన్ని చూసి,తిరువణామలైకి దగ్గర రైల్వేస్టేషన్ “దిండివనం” అనుకున్నాడు.కాని, ఆ మధ్యే ‘విల్లుపురం కాట్పాడి” మధ్య రైలు మార్గంఏర్పడిన సంగతి అతనికి తెలియదు. అందుచేత రైలు టిక్కెట్టునిమిత్తం మూడు రూపాయలు తీసుకుని, “నేను నా తండ్రి ఆజ్ఞానుసారం ఆయన్నే వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది పుణ్యకార్యం కనుక నా కోసం ఎవరూ విచారించకండి. డబ్బు ఖర్చు39
పెట్టి దీన్ని వెతక్కండి,” అని ఒక చీవీ రాసి, “నీ కాలేజీ జీతంకట్టలేదు. ఇందులో రెండు రూపాయలు ఉంచుతున్నాను.” అనిరాసి, ముగింపులో “ఇట్లు” అని కొన్ని చుక్కలు పెట్టి, ఉత్తరంపూర్తి చేశాడు




















