ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే, దాన్ని అసిడిటీగా భావించాలి. అయితే, ఈ సమస్యను తగ్గించడానికి కొన్ని యోగాసనాలు సహాయపడతాయి. వాటిలో ఒకటి మార్జరియాసనం.
ఈ ఆసనం వెన్ను మరియు పొత్తికడుపుపై ప్రభావం చూపుతుంది. జీర్ణవ్యవస్థలో రక్తప్రసరణను పెంచి, సంబంధిత అవయవాలకు వ్యాయామం అందిస్తుంది. మృదువైన మర్దన ద్వారా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడంతో అసిడిటీ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.




















