నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు రెండో రోజు కస్టడీకి తరలించబడ్డారు. ఈరోజు ఏ1 జనార్థన్ రావు, ఏ2 జగన్ మోహన్ రావు ను గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
విచారణలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ఆర్థిక మూలాలు, సూత్రధారులపై కసరత్తు జరుగుతోంది. అలాగే, వైసీపీ నేత జోగి రమేష్ తో జనార్థన్ రావు సంబంధాలపై కూడా పరిశీలన జరుగుతోంది.
కోర్టు జనార్థన్ రావు, జగన్మోహన్ రావును వారంరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నిర్ణయించింది.



















