ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణము 8వ అధ్యాయము

October 29, 2025
in Devotional News
0
కార్తీక పురాణము 8వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కార్తీక పురాణము 8వ అధ్యాయము
(శ్రీహరినామస్మరణాధన్యోపాయం)
వశిష్ఠుడు చెప్పినదంతా విని “మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభముగా కలుగుననియూ, అది – నదీస్నానము,దీపదానము, ఫలదానము,అన్నదానము,వస్త్రదానము,వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనరబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను” యని కోరెను. అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, “జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే,నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి యేమనగా సాత్త్విక, రాజస, తాపసములు అని ధర్మము మూడురకములు. సాత్త్విక, మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము.ఆ ధర్మమందు యెంతయో ఆధిక్యత కలదు. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణినది సముద్రమున కలియ తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమగు విధముగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరించుచూ గంగ,యమున,గోదావరి కృష్ణనదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ దేవాలయ ములయందూ – వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక ఆ నదీతీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేషఫలమును పొందగలరు.
రాజస ధర్మమనగా – ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున దగును.తామస ధర్మమనగా – శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీ మన్నారాయణుని నామము, తెలిసిగాని,తెలియకగాని ఉచ్ఛరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.
అజామీళుని కథ
పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతు లన్యోన్య ప్రేమకలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాబుని అతి గారాబముగా పెంచుచు, అజామీళుడని నామకరణము చేసిరి.ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు, దుష్టసావాసములు చేయుచు, విద్య నభ్యసింపక, బ్రాహ్మణధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై,మంచి చెడ్డలు మరచి, యజ్ఞోపవీతము త్రెంచి,మద్యం సేవించుచు, ఒక ఎరుకలజాతి స్త్రీని వలచి,నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యింటనే భుజించుచుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగమున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటినుంచీ అదుపు ఆజ్ఞలలో నుంచకపోయినయెడల యీ విధంగానే జరుగును. కావున అజామీళుడు కులభ్రష్టుడు కాగా,వానిబంధువు లతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను,జంతువులను చంపుతూ కిరాతవృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను.

       వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుచుచు ఒక్కక్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్లినా వెంటాబెట్టుకొని వెళ్లుచూ, "నారాయణ - నారాయణ" అని ప్రేమతో సాకుచుండిరి. కాని "నారాయణ" యని స్మరించిన యెడల తమ పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననిమాత్ర మాతనికి తెలియకుండెను.  ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజమీళుడు భయము చెంది కుమారునిపై నున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక "నారాయణా" యనుచునే ప్రాణములు విడిచెను.  అజామీళుని నోట "నారాయణా" యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదేవేళకు దివ్యమంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి "ఓ యమభటులారా! వీడు మావాడు.   మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి" యని చెప్పి,అజామీళుని విమాన మెక్కించి తీసుకొనిపోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోవుటకు మేమిచ్చటకి వచ్చితిమిగాన, వానిని మాకు వదలు" డని కోరగా విష్ణుదూతలు యిట్లు చెప్పదొడంగిరి.

ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.
– స్వస్తీ…

Tags: DevotionKarthika masam
ShareTweetSend
Previous Post

శ్రీకాకుళం: మొంథా తుపానుతో భారీ వర్షాలు.. బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది

Next Post

‘మొంథా’: ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత నిత్యావసర సరఫరా – ఏపీ ప్రభుత్వం జీవో జారీ

Related Posts

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!
Devotional News

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!

September 8, 2026
గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక
Devotional News

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

September 5, 2026
500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు
Devotional News

500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు

September 5, 2026
Wishing you and your loved ones a blessed and joyful Krishna Ashtami!
India News

Wishing you and your loved ones a blessed and joyful Krishna Ashtami!

September 4, 2026
పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు
Devotional News

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

September 3, 2026
రౌతులపూడిలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు
Devotional News

రౌతులపూడిలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు

September 3, 2026
Next Post
‘మొంథా’: ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత నిత్యావసర సరఫరా – ఏపీ ప్రభుత్వం జీవో జారీ

‘మొంథా’: ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత నిత్యావసర సరఫరా – ఏపీ ప్రభుత్వం జీవో జారీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

September 8, 2026
జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

September 8, 2026

Recent News

మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

September 8, 2026
జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

September 8, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.