పూరీ జగన్నాథుడి ఆలయానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పాలనావిభాగం (ఎస్‌జేటీఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో ఆలయం పేరిట ఉన్న ఖాతాల్లో మొత్తం రూ.1,912 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది.
ఈ మొత్తంలో రూ.1,811 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉండగా.. మరో రూ.100.71 కోట్లు సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఇందులో రూ.500 కోట్లు ఒడిశా ప్రభుత్వం అందించిన కార్పస్ ఫండ్‌గా ఉన్నాయని ఆలయ పాలనావిభాగం తెలిపింది.
అంతేకాకుండా స్వామివారి పేరిట దేశవ్యాప్తంగా 60,821 ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడించింది. అందులో 60,426 ఎకరాలు ఒడిశాలోనే ఉన్నాయి. ఆలయ రత్నభండార్‌లో విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు కూడా ఉన్నాయి.
ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలతో పాటు ఆలయం పేరిట ఉన్న క్వారీలు, గనుల ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంకు డిపాజిట్లపై లభించే వడ్డీ, ప్రభుత్వ గ్రాంట్లు, భూవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయం ప్రధాన వనరులుగా ఉన్నాయి.
వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని కార్పస్ ఫండ్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో, మరికొంత మొత్తాన్ని ఫౌండేషన్ ఫండ్‌గా జమ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని ఆలయ నిధిగా ఉంచి రోజువారీ ఖర్చులకు వినియోగిస్తారు. హుండీ ద్వారా వచ్చే విరాళాలను ప్రతిరోజూ లెక్కించి, ఆ వివరాలను భక్తులకు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
అలాగే ఆలయ పాలనావిభాగం ‘సమర్పణ్’ పేరుతో డిజిటల్ విరాళాల వేదికను నిర్వహిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















