మాజీ మంత్రి, వైకాపా నేత విడదల రజని పీఏలు మరియు అనుచరులపై దోర్నాలకు చెందిన బీ.ఫార్మసీ విద్యార్థి కృష్ణతో పాటు మరికొందరు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విడదల రజని పీఏలు శ్రీకాంత్‌రెడ్డి, దొడ్డా రామకృష్ణ, అలాగే ఆమె అనుచరులు శ్రీగణేశ్, అతని సోదరుడు కుమారస్వామి కలిసి రూ.5 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.



















