వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వేలం కేంద్రాల్లో “నో బిడ్” అనే పరిస్థితి ఉండకూడదని ఆయన తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది నుంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంట సాగు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లతో గురువారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రేడర్ల ఇబ్బందులను వివరంగా తెలుసుకున్నారు. రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కంపెనీలు, ట్రేడర్లు మానవీయ కోణంలో సహకరించాలని ఆయన సూచించారు.
పొగాకు రైతులు, బోర్డు ప్రతినిధులతో కలిసి దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలసి సమస్యలను వివరించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి సీఎం సూచించారు.
సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డీఎస్‌బీవీ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వేలం కేంద్రాలకు వచ్చే మొత్తం పొగాకును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
అన్ని కంపెనీలు వేలంలో పాల్గొని కొనుగోలు చేయాల్సిందేనని తెలిపారు.
అనధికారికంగా కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని చెప్పారు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















