అధిక సమయం లేకపోయినా సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు..! తైవాన్ మహిళలు కేవలం నాలుగు దశల్లో తక్కువ సమయంలోనే తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటారు.
క్లెన్సింగ్
ముందుగా చర్మంపై పేరుకున్న దుమ్ము, చెమట, జిడ్డుదనాన్ని తొలగించడానికి సహజసిద్ధమైన క్లెన్సర్లను ఉపయోగిస్తారు. సోయా పాలు, వైట్ టీ, వెదురు ఎక్స్‌ట్రాక్ట్స్ వంటి పదార్థాలతో చర్మాన్ని శుభ్రం చేస్తారు.
టోనింగ్
రెండో దశలో టీట్రీ ఆయిల్, హయాల్యురోనిక్ యాసిడ్, మొక్కల ఎక్స్‌ట్రాక్ట్స్‌తో చర్మాన్ని టోనింగ్ చేస్తారు. ఇది పిగ్మెంటేషన్ సమస్యలను తగ్గిస్తూనే చర్మంలోని సీబమ్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది, ఫలితంగా చర్మం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
మాయిశ్చరైజింగ్
తైవాన్ మహిళల అందానికి తేమ అత్యంత ముఖ్యము. మూలికలు, వృక్ష సంబంధిత పదార్థాలతో తయారైన మాయిశ్చరైజర్‌ను రోజూ ఉపయోగిస్తారు. అదనంగా, నీళ్ళు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికమైన ఆహారాలు తీసుకోవడం అలవాటు.
షీట్ మాస్క్
తైవాన్ మహిళల బ్యూటీ రొటీన్ చివర షీట్ మాస్క్‌తో పూర్తవుతుంది. మొక్కల ఆధారిత షీట్ మాస్క్‌ను పావుగంట పాటు ముఖంపై ఉంచి, తక్షణమే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందుతారు.




















