ఉప్పల్ మల్లికార్జుననగర్‌లో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ పనిచేస్తుండగా, ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల వివరాల ప్రకారం, గత నెల 23 నుంచి అతడు విధులకు హాజరుకాలేదు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


















