అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని శాఖమూరు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.
పొట్టి శ్రీరాములు అనేక సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని, మహాత్మా గాంధీ నాయకత్వంలో సేవలు అందించారని సీఎం గుర్తుచేశారు. ఆయన 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించామని తెలిపారు. ఈ విగ్రహ నిర్మాణంలో 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ నిర్మాణ సామగ్రి ఉపయోగించినట్లు వివరించారు. అమరావతిలో అమరజీవి విగ్రహ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇక గత పాలకులు మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని అభివృద్ధినే అడ్డుకున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానం, ఎడారి అంటూ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములుగా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్లగా, రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి నష్టం జరిగిందని, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పాటయ్యిందని చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా సరైన నిర్ణయాలతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించగలమని అన్నారు. కష్టకాలంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. అలాగే గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















