రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈనెల 22 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున సుమారు 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెటలో ఈనెల 22న జరిగే సభలో సీఎం రేవంత్‌రెడ్డి నిధుల విడుదలకు శ్రీకారం చుడతారు.
ఆ రోజున ఒక ఎకరం వరకు భూమి కలిగిన 73 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం 20 రోజుల తర్వాత రెండో విడతగా రూ.2,650 కోట్లను విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా రూ.2,760 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడు సీజన్లలో రైతులకు పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపారు. 2023-24 యాసంగి సీజన్‌లో ఎకరానికి రూ.5000 చొప్పున రూ.7,625 కోట్లు, 2024-25 యాసంగిలో రూ.5,057 కోట్లు, 2025-26 వానాకాలం సీజన్‌లో ఎకరానికి రూ.6000 చొప్పున రూ.8,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ ఏడాది సుమారు 73 లక్షల మంది రైతులకు రూ.8,881 కోట్ల నిధులు అవసరమని వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చింది. రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మొత్తం రూ.9,000 కోట్ల నిధులు విడుదల చేయడానికి అంగీకరించింది.
ఇక నర్మెటలో జరిగే సభలో సీఎం ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూనె ఉత్పత్తుల రిఫైనరీకి శంకుస్థాపన చేయనున్నారు. అదే సందర్భంగా వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి రైతులతో భారీ సభ నిర్వహించనున్నారు. రైతుల సమక్షంలో రైతు భరోసా నిధులను విడుదల చేయడం ద్వారా రైతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















