దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన తీవ్ర విషాదానికి కారణమైంది. ఈ ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం చోటుచేసుకున్న ఈ పేలుడులో తొలుత 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు మంగళవారం ప్రాణాలు కోల్పోయినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.




















