దృష్టి లోపం ఉన్నవారికి సహాయపడే ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఈఈఈ శాఖ విద్యార్థులు ఎస్. చెన్నకేశవ దుర్గాప్రసాద్, ఎస్. అభినందన రూపకల్పన చేశారు. ఈ పరికరంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వినియోగించారు. కళ్లద్దాల్లో అమర్చిన కెమెరా ద్వారా మనుషులు, వస్తువులు, అడ్డంకులను గుర్తించి వాటిని వాయిస్ అవుట్‌పుట్ ద్వారా వినిపిస్తుంది. ఇది 40 మీటర్ల దూరం వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.
టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్ ద్వారా దృష్టి లోపం ఉన్నవారు పుస్తకాలు చదవడంలో, కరెన్సీ నోట్లను గుర్తించడంలో సులభతరం అవుతుంది. ఈ పరికరంలో యూఎస్‌బీ, బ్యాటరీ సదుపాయాలు ఉన్నాయి. యుక్తి స్కీమ్‌లో భాగంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌కు పలు జాతీయ స్థాయి ప్రదర్శనల్లో అవార్డులు లభించాయి. జేఎన్‌టీయూకే నిర్వహించిన నేషనల్ లెవెల్ హార్డ్‌వేర్ వర్క్‌షాప్‌లో ప్రథమ బహుమతి సాధించింది. ఈ ప్రాజెక్ట్ ఏఐసీటీఈ ప్రొడక్టైజేషన్ ఫెలోషిప్ మొదటి రౌండ్‌కి ఎంపికైందని మెంటార్ షేక్ చాన్‌బాషా తెలిపారు.



















