శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలోని విశ్వనాథస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ అర్చకుడు శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, కార్తికమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్న వేళ నాగుపాము స్వామి సమీపానికి చేరుకుని కొద్దిసేపు పడగవిప్పి నిలిచిందన్నారు. అనంతరం అది ఆలయం వెనుక ఉన్న పుట్టలోకి చేరిపోయిందని తెలిపారు.




















