ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని ‘భాత్‌ఖండే సంగీత విశ్వవిద్యాలయం’ పదవీ విరమణ వయసులో ఉన్న వృద్ధులకు రెండో ఇల్లుగా మారింది. 60 నుండి 85 ఏళ్ల వయస్సు కలిగిన దాదాపు వంద మంది ఇక్కడ సంగీతం నేర్చుకుంటూ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. వయసు పెద్ద ఆటంకం కాదని, జీవితాన్ని మళ్లీ ఆస్వాదించవచ్చని వారు ప్రదర్శిస్తున్నారు. గతంలో ఉద్యోగం, బాధ్యతల కారణంగా మనసులో నిలిచిపోయిన సంగీత సరాగాలను మళ్లీ ఆనందిస్తూ శ్రవణ చేస్తున్నారు. తాతయ్యలు, అమ్మమ్మలుగా మారిన వీరు విద్యార్థులుగా ఉత్సాహంగా తరగతులకు హాజరవుతున్నారు. సితార్, సరోద్, తబలా, హార్మోనియం, పిల్లనగ్రోవి వాయిద్యాల్లో కొందరు స్వరాలు పలికిస్తుండగా, మరికొందరు గాత్ర సాధన చేస్తున్నారు. యువ ఉపాధ్యాయులు వారిని బోధించడం ప్రత్యేకత.




















