ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బహ్రాయిచ్ జిల్లాలోని కౌడియాల నది వరద ప్రవాహంలో ఐదు ఏనుగులు కొట్టుకుపోవడం తీవ్ర కలకలం రేపింది. ఏనుగుల గుంపు గిర్జాపురి బ్యారేజ్ వైపు కొట్టుకుపోతున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కతర్నియాఘాట్ వన్యప్రాణి విభాగం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏనుగులు బ్యారేజ్ వైపు వెళ్లకుండా అప్రమత్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజ్ గేట్లను మూసివేయడంతోపాటు వరద ప్రవాహం తగ్గే వరకు పరిస్థితిని పర్యవేక్షించారు.
నీటి ప్రవాహం తీవ్రత తగ్గిన అనంతరం అధికారులు ఐదు ఏనుగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. రక్షించిన ఏనుగుల్లో రెండు పిల్ల ఏనుగులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏనుగుల ఆరోగ్య పరిస్థితిని అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం 75 జిల్లాల్లో వర్ష సూచనలు ఉండగా.. ఏడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, 33 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. లఖ్‌నవూ, వారణాసి, అయోధ్య, ఝాన్సీ సహా పలు నగరాల్లో మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురిశాయి.
వరద ముప్పు నేపథ్యంలో 19 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















