మహేశ్‌బాబు కథానాయకుడిగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్ మూవీకి ‘వారణాసి’ (Varanasi) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచానికి పరిచయం చేయడం కోసం శనివారం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో #GlobeTrotterEvent నిర్వహించారు. మహేశ్‌బాబు మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో, రుద్ర పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్‌ను అందించనున్నారు. కథానాయికగా ప్రియాంక చోప్రా, ప్రతినాయకుడిగా ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ అలరించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. మూవీని 2027 వేసవిలో రిలీజ్ చేయాలని ప్రణాళిక పెట్టారు.




















