అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో అగ్ర మావోయిస్టు నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఇదే పరిస్థితి…
సుక్మా జిల్లాలోని ఎర్రబోరు ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అక్కడ కూడా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.




















