విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ సమీపంలోని అనాసాగరం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అనాసాగరం బైపాస్ వద్ద లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లుతున్న ఈ బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారు శ్రీకాకుళం మరియు ఒడిశా ప్రాంతాలకు చెందినవారని గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని విజయవాడకు పంపించారు. ప్రమాదంలో దెబ్బతిన్న బస్సు, లారీని క్రేన్ సహాయంతో తొలగించి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.




















