నిండు ప్రాణం పోతుంటే నిల్చుండిపోయారు ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అన్న అందెశ్రీ పాట గుంటూరు(D) కురగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదానికి సరిగ్గా సరిపోతుంది. లారీని ఓవర్టేక్ చేయబోయి ఓ వ్యక్తి కింద పడిపోయాడు. అతని పైనుంచి లారీ దూసుకెళ్లింది. అక్కడున్న ఎవరూ అతడిని కనీసం పట్టించుకోలేదు. అసలు ప్రమాదమే జరగలేదన్నట్లు వాళ్లు ప్రవర్తించడం విస్మయానికి గురి చేస్తోంది. చివరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు.




















