3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వియత్నాంను వరదలు ముంచెత్తాయి. 1500MMలకు పైగా వర్షం కురవడంతో సెంట్రల్ వియత్నాంలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. 43వేల నివాసాలు, 10వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అక్కడి విపత్తు శాఖ తెలిపింది. చాలా ప్రాంతాలను వరద వీడకపోవడంతో ప్రజలు ఇళ్లపైకి చేరి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.




















