ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. శ్రీసత్య సాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. కాగా ఇవాళ దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది క్రమంగా తుఫానుగా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది.



















