విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఘటన అనంతరం స్కూల్ నుంచి చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, బాత్రూమ్‌లో జారి పడడంతో గాయాలయ్యాయని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే స్కూల్‌కు చేరుకున్న తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా చిన్నారిపై యాసిడ్ దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ప్రైవేట్ భాగాల వద్ద గాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా స్పందించారని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి తల్లిదండ్రులు, బాధ్యులైన టీచర్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్
చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















