ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వల్లే భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.
దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘రైసినా డైలాగ్’ సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ఐటీ రంగంలో భారతీయుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, డిప్లమసీ మరియు ఫ్లెక్సిబిలిటీ విషయంలో కూడా భారతీయులకు మంచి పేరు ఉందని అన్నారు.
భారత్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో వేగంగా ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. విదేశాలకు చదువుకోడానికి వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని పేర్కొన్నారు.ప్రపంచంలో అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జనాభా నిర్వహణ చాలా ముఖ్యమని చంద్రబాబు అన్నారు. దక్షిణ భారతంలో సంతానోత్పత్తి రేటు కేవలం 1.5 శాతమే ఉందని గుర్తు చేశారు. గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించామని, కానీ ఇప్పుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని సూచిస్తున్నామని తెలిపారు. ఇద్దరికి మించి పిల్లలు ఉన్న కుటుంబాలకు పలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
భవిష్యత్‌లో ప్రపంచ సమాజానికి సేవ చేసే సామర్థ్యం భారత్‌కే ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విభిన్న ఆలోచనలు కలిగిన యువత కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీలు ఏర్పాటు చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో త్వరలోనే పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని, భవిష్యత్‌లో డ్రోన్ అంబులెన్స్‌లు కూడా అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















