ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనం భక్తులకు సుమారు 24 గంటల సమయం పట్టుతోంది. రూ.300 శీఘ్ర దర్శనం కోసం 3 నుండి 5 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,615 కాగా, తలనీలాలు సమర్పించిన వారు 27,722 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹4.23 కోట్లు నమోదైంది.




















