దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. ఆదివారం తిరుమలలోని దర్శనీయ ప్రదేశాలు, పాపవినాశనం ప్రాంతాలు, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు మూసివేయబడ్డాయి. ఘాట్రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారుల కోసం అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.
తిరుమలలోని ఐదు డ్యామ్‌లు పూర్తిగా నిండిపోయి పొంగుతున్నాయని తితిదే వాటర్‌వర్క్స్ ఇంజినీర్ ఈ. సుధాకర్‌రెడ్డి తెలిపారు. గోగర్భం, పాపవినాశనం డ్యామ్‌లలో ఒక గేటు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆకాశగంగ, కుమారధార, పసుపుదార డ్యామ్‌లు కూడా పూర్తిగా నిండాయి. ఈ వర్షంతో తిరుమలలోని పలు తీర్థాలు, జలపాతాలు జలకళలో మునిగిపోయాయి.





















