ఆస్ట్రేలియాలో నిన్న బాండీ బీచ్ వద్ద కాల్పులకు పాల్పడింది తండ్రీకొడుకులేనని పోలీసులు వెల్లడించారు. వీరిలో తండ్రి సాజిద్ అక్రమ్(50) మరణించినట్లు తెలిపారు. అతడి కొడుకు నవీద్ అక్రమ్(24) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో వాడిన ఆయుధాలకు సాజిద్ వద్ద లైసెన్స్ ఉందని చెప్పారు. ఈ దాడిలో మరణాల సంఖ్య 16కు చేరింది.




















