రామాపురం అనే గ్రామంలో బ్రహ్మాజీ, రఘు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ కూలి పనులు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకునేవారు. అయితే రోజూ కష్టపడి పనిచేసినా పెద్దగా ఆదాయం లేకపోవడంతో ఒక రోజు బ్రహ్మాజీ తన స్నేహితుడు రఘుతో మాట్లాడాడు.
“ఇలా ఎన్ని రోజులు కూలి పని చేస్తాం? మనమే ఒక చిన్న వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుంది. రొట్టెలు అమ్మే దుకాణం పెట్టుకుందాం” అని సూచించాడు. రఘుకూ ఆ ఆలోచన నచ్చింది. అయితే ఇద్దరూ ఒకేచోట కాకుండా ఊరి రెండు చివర్లలో దుకాణాలు పెట్టుకుంటే బాగుంటుందని నిర్ణయించారు.అనుకున్నట్లుగానే ఇద్దరూ రొట్టెలు అమ్మే చిన్న దుకాణాలు ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాయి. ఇద్దరి వ్యాపారాలు కూడా సాధారణంగా నడుస్తూ ఉన్నాయి. కానీ బ్రహ్మాజీకి మాత్రం ఇంకేదైనా కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుందనిపించింది.
ఒక రోజు అదే విషయం రఘుతో చెప్పాడు. అప్పుడు రఘు ఇలా అన్నాడు:
“అలాంటి కొత్త ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. అసలే వ్యాపారం అరకొరగా నడుస్తోంది. మధ్యలో ఇలా మార్పులు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మళ్లీ కూలి పనికే వెళ్లాల్సి వస్తుంది” అని చెప్పాడు.అయినా బ్రహ్మాజీ ఆలోచనను వదల్లేదు. ఇంటికి వెళ్లాక బాగా ఆలోచించాడు. మరుసటి రోజు నుంచి రొట్టెల రుచిని మార్చేందుకు కొత్త ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. రొట్టెల్లో కొన్ని ఇతర ఆహార పదార్థాలు కలిపి వేర్వేరు రకాలుగా తయారు చేశాడు.
మొదట్లో వాటిని తన దగ్గరికి వచ్చే కొద్దిమందికి మాత్రమే ఇచ్చి పరీక్షించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ కొత్త రుచులు చాలా మందికి నచ్చాయి. అలా క్రమంగా ఆ ప్రత్యేక రొట్టెలకు డిమాండ్ పెరిగింది.దాంతో బ్రహ్మాజీ వేర్వేరు రుచుల రొట్టెలను పెద్ద మొత్తంలో తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు. తన దుకాణం ముందు “ఇక్కడ ప్రత్యేక రొట్టెలు లభిస్తాయి” అని బోర్డు కూడా పెట్టాడు. అలా కొంచెం ధైర్యం చేసి కొత్తగా ప్రయత్నించినందుకు అతని వ్యాపారం రోజురోజుకు పెరిగింది.ఇక రిస్క్ తీసుకోవడానికి భయపడ్డ రఘు మాత్రం అదే పాత విధానంలో రొట్టెలు అమ్ముకుంటూ ఉన్నచోటే ఉండిపోయాడు.
నీతి:
జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొన్నిసార్లు కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు చేయడానికి ధైర్యం అవసరం. మార్పును స్వీకరించినవారే విజయాన్ని అందుకుంటారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















