అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. ఇస్రో తొలిసారిగా 6,100 కేజీల బరువున్న భారీ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహాన్ని అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించింది. భారీ బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా ఇస్రో సాంకేతిక సామర్థ్యం మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయంగా నిలవనుంది.




















